శ్రీలీల (జననం 2001 జూన్ 14) భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ తెలుగు నటి. విజయవంతమైన తెలుగు,కన్నడ చిత్రాలలో నటించిన ఆమె 2019లో కిస్ చిత్రంతో అరంగేట్రం చేసింది.దీనికిగాను సైమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ ఆమెకు వరించింది. ఆ తరువాత భరతే (2019),పెళ్లి సందడి (2021), బై టూ లవ్ (2022) వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.
జీవితం తొలి దశలో
2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక తెలుగు కుటుంబంలో శ్రీలీల జన్మించింది. ఆమె కర్ణాటకలోని బెంగుళూరులో పెరిగారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్.స్వర్ణలత పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును వివాహం చేసుకుని, విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది. శ్రీలీల తన చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ప్రారంభించింది. ఆమె డాక్టర్ అవ్వాలని ఆకాంక్షించి, 2021 నాటికి ఎం.బి.బి.ఎస్ చివరి సంవత్సరంలో అడుగుపెట్టింది. శ్రీలీల 2022 ఫిబ్రవరిలో గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. అనాథాశ్రమంలో వారిని చూసి చలించి శ్రీలీల ఇలా పసి పిల్లలను చేరదీయడం గమనార్హం.
కెరీర్
సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తీసిన శ్రీలీల చిత్రాలను సోషల్ మీడియాలో చూసిన దర్శకుడు ఎ.పి.అర్జున్, ఆమెను తన దర్శకత్వం వహించిన కిస్ (2019) చిత్రంలో అవకాశమిచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయాలు ఉన్నప్పటికీ బెంగుళూరులో పెరిగినందున కన్నడ చిత్రాలలో తన కెరీర్‌ను ప్రారంభించాలని శ్రీలీల నిర్ణయించుకోవడం దీనికి కారణం.
ఆమె తన ప్రీ-యూనివర్శిటీ కోర్సు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు 2017లో తన తొలి చిత్రం కిస్ షూటింగ్‌ను ప్రారంభించింది. 2019లో కిస్ విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతమైంది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఎ. శారద, శ్రీలీల ఆత్మవిశ్వాసంతో అరంగేట్రం చేసిందని పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు వినయ్ లోకేష్ కూడా ఆమె తన పాత్రలో మెరిసిందని పేర్కొన్నాడు. ఒక నెల తర్వాత, శ్రీమురళి సరసన ఆమె రెండవ చిత్రం భరతే విడుదలైంది. అరవింద్ శ్వేత ది న్యూస్ మినిట్ లో “శ్రీలీలా చాలా బాగుంది, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ విషయానికి వస్తే శ్రీమురళితో పాటు తనదైన శైలిని కలిగి ఉంది.” అని రాసారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో తిరిగి ఎ. శారద శ్రీలీల తన రెండవ చిత్రంలోనే కెమెరా ముందు ఎంతో సౌకర్యంగా ఉండడం, పాత్రలో జీవించడంపై కొనియాడారు,
ఇక తెలుగులోకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి (2021)తో వచ్చింది. ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను ఎదుర్కున్నా శ్రీలీల మాత్రం విమర్శకుల నుండి ప్రశంసలను అందుకోవడం విశేషం.
ఆమె తిరిగి 2022లో కన్నడ రొమాంటిక్ కామెడీ బై టూ లవ్‌లో నటించింది. ఇందులో ఆమె నటనను మెచ్చుకుంటూ పలు జాతీయ పత్రికలలో రివ్వ్యూలు వచ్చాయి. పెళ్లి సందడి విజయం తర్వాత శ్రీలీలకు తెలుగు చిత్రాలలో పలు ఆఫర్లు వచ్చాయి. నిర్మాణ దశలో ఉన్న నాలుగు చిత్రాలకు ఆమె సంతకం చేసింది. ఆమె రవితేజతో జంటగా నటించిన ధమాకా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆమె నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఓ రాజు చిత్రంలో నటించింది. శ్రీలీల ఇంకా పేరు పెట్టని తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంలోనూ, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌తోనూ కలిసి నటిస్తోంది.
ఈమె శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రవీణురాలు. ఇక సినిమాలో పాటలకు ఈమె డాన్స్ ఇరగదీస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
కుర్చీ మడతపెట్టి… పూర్తి వీడియో సాంగ్ | గుంటూరు కారం | మహేష్ బాబు | శ్రీలీల | త్రివిక్రమ్ | తమన్ ఎస్
శ్రీలీల మాస్ డ్యాన్స్ |రా రా బంగారం |నువ్వు విజిలేస్తేయ్ |రాములూ రాములా |ఆదికేశవ |వైష్ణవ్ తేజ్
పల్సర్ బైక్… పూర్తి వీడియో సాంగ్ | ధమాకా | రవితేజ | శ్రీలీల | త్రినాధ రావు | భీమ్స్ సిసిరోలియో
This post was created with our nice and easy submission form. Create your post!
GIPHY App Key not set. Please check settings