The Fantastic Four: First Steps Review
చిత్రం : ఫెం టాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్‌స్టెప్స్;
నటీనటులు: పెడ్రో పాస్క ల్,వన్నె స్సా కిర్బీ , ఎబన్ మోస్ బాక్రాక్, జోసెఫ్ క్వి న్, జూలియా గార్న ర్ తదితరులు;
దర్శకత్వం : మ్యాట్ షాక్మెన్;
విడుదల:25-07-2025
మన పురాణాల నుం చి అమెరికన్ కామిక్ బుక్స్ వరకూ ఏది తీసుకున్నా , చెడుపై ఎప్పుడూ మంచిదే విజయం . దేవుడో,సూ పర్ హీరోలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించడంతో కథ సుఖాంతం అవుతుంది. తాజాగా వచ్చిన ‘ఫెంటాస్టిక్ ఫోర్:ఫస్ట్ స్టెప్స్‌స్టెప్స్’ను కూడా దర్శకుడు మ్యాట్ ఆ విధంగానే అలరించేలా తీర్చిదిద్దాడు.
ఎవరెలా చేశారు..
ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మొత్తం తమదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా బిడ్డను కాపాడుకునేందుకు సాహసించే సగటు తల్లిగా స్యూ పాత్రలో వన్నెస్సా కిర్బీకి ఎక్కువ మార్కులు పడతాయి. జానీ స్ట్రామ్‌గా జోసెఫ్ క్విన్ పాత్ర ఆద్యంతం నవ్వులు పంచుతుంది. మిగిలిన వాళ్లు తమకున్న పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది.
1960నాటి కాలాన్ని , అప్పటి టెక్నాలజీని తెరపై ఆవిష్కరించిన తీరు చక్కగా ఉంది.కథా వస్తువు, అందులో సంఘర్షణ చాలా చిన్నది కావడంతో సినిమా అప్పుడే అయిపోయిందా? అనిపిస్తుంది. గలాక్టస్‌క్టపాత్రను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. భారీ ఆకారాన్ని చూపించారే తప్ప , అతడికున్న బలమేంటో చూపించలేదు. వాల్‌డిస్నీవీఎఫ్‌ఎక్స్ వర్క్ గురిం చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఎలిమెంట్స్ , సన్నివేశాలను చిన్నారులను ఆకట్టుకుంటాయి.
బలాలు
+ నటీనటులు
+ నిడివి
+ విజువల్ ఎఫెక్ట్స్
బలహీనతలు
– చిన్నదైన కథా వస్తువు
– యాక్షన్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడం
చివరిగా: చిన్నారులను అలరించే మరో సూపర్ హీరోస్ ఫిల్మ్
సౌజన్యం : ఈనాడు
పూర్తి రివ్యూ లింక్ : https://www.eenadu.net
This post was created with our nice and easy submission form. Create your post!
GIPHY App Key not set. Please check settings