పిల్లల్లో ఏదైనా లోపం ఉంటే.. కన్న వారే వారిని అసహ్యించుకుంటే? కెరీర్ విషయంలో నిరుత్సాహపరిస్తే?.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు కాయోజ్ ఇరానీ. ఆ ఎమోషనల్ పాయింట్‌కు దేశభక్తిని జోడించి ‘సర్‌జమీన్’ (Sarzameen) చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), కాజోల్ (Kajol), ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar)లో రిలీజ్ అయింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నఈ సినిమా ఎలా ఉందంటే..?
*టైటిల్ (భూమి/దేశం )ని బట్టి ఇది పూర్తిస్థాయి వార్ సినిమా అనుకుంటే పొరపాటే. అలాంటి అంచనాలతో ఈ చిత్రాన్నిచూస్తే నిరాశ తప్పదు. ఈ కథ ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది.
*తల్లో, తండ్రో తమ లోపాన్ని వేలెత్తి చూపుతూ నిరుత్సాహపరిస్తే.. వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పెరిగే కోపం, దాని వల్ల జరిగే అనర్థాలను దర్శకుడు చర్చించారు. మరోవైపు, పిల్లలకు ద్వేషాన్ని నూరిపోస్తే.. వాళ్లెంతకు తెగిస్తారన్నదీ ప్రస్తావించారు.
* క్లైమాక్లైను ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా తీర్చిదిద్దారు
* ఎప్పటిలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. కాజోల్‌ప్రభావం చూపలేకపోయారు. హర్మన్ పాత్రకు హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహాం ఫర్వాలేదనిపించాడు. ఈ ముగ్గురికే స్క్రీ న్‌ప్రెజెన్స్ ఎక్కువ. ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఆయన కుమారుడే ఈ సినిమా డైరెక్టర్ కావడం విశేషం.
**చివరిగా: ‘సర్‌జమీన్’.. ఓన్లీ ఎమోషన్!
సౌజన్యం : ఈనాడు, పూర్తి రివ్యూ కోసం లింక్
తెలుగు మూవీ రివ్యూస్ ఛానల్ రివ్యూ
ఫీటు గాడి మీడియా ఛానల్ రివ్యూ
This post was created with our nice and easy submission form. Create your post!
GIPHY App Key not set. Please check settings