in

హరి హర వీర మల్లు మూవీ రివ్యూల సమాహారం

చిత్రం : హరి హర వీరమల్లు

నటీనటులు: పవన్‌కల్యా ణ్‌, బాబీ దేవోల్‌, నిధిఅగర్వా ల్‌, సత్య రాజ్‌, విక్రమ్‌ జీత్‌, అయ్య ప్ప పి.శర్మ , నర్గీస్‌ ఫక్రీ, దలిప్‌ తాహిల్‌ తదితరులు;

సంగీతం : ఎం.ఎం.కీరవాణి;  సినిమాటోగ్రఫి  : జ్ఞానశేఖర్‌, మనోజ్‌ పరమహంస; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.; మాటలు: బుర్రా సాయిమాధవ్‌; కథ, స్క్రీన్‌ప్లే:క్రిష్‌ జాగర్లమూర్ల మూడి;  నిర్మాత: ఏఎం రత్నం , ఎ.దయాకరరావు;

దర్శకత్వం : క్రిష్‌, ఏఎం .జ్యోతికృష్ణ;

విడుదల: 24-07-2025

కథానాయకుడు కోహినూర్ కోసం దిల్లీకి వెళ్లేక్రమంలో ఎదురయ్యే పరిస్థితులే ఇందులో కీలకం. వీరమల్లు పాత్రని, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్ధం సినిమాకి హైలైట్ కాగా, ద్వితీయార్ధానికి ప్రీ క్లైమాక్స్ ప్రధానబలం.

వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం , అందులో చూ పించిన హీరోయిజం ,ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయి. సుదీర్ఘకాలం పాటు సినిమా సాగినా లుక్ పరంగా ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. క్రూరమృ గాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ , సనాతన ధర్మం ఇతివృత్తంగా సాగే సన్నివేశాల్లోఆయన భావజాలమే కనిపిస్తుంది.

కీరవాణి నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు. సంగీతం తోనే హీరోయిజాన్ని పతాక స్థాయిలో నిలబెట్టారు. పాటలు కూడా బాగున్నా యి. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస విజువల్స్ ఆకట్టుకుంటాయి.

బలాలు

+ పవన్‌కల్యా ణ్‌

+ కీరవాణి సంగీతం

+ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్

బలహీనతలు

– కొత్తదనం లేని కథనం

– విజువల్ ఎఫెక్ట్స్

చివరిగా: వీరమల్లు… పవన్‌కల్యా ణ్ వన్‌ మేన్‌ షో

సౌజన్యం:  ఈనాడు లింక్


జబర్దస్త్ మహీధర్ వీడియో రివ్యూ 👇🏿


రగడి వీడియో రివ్యూ 👇🏿


థైవ్యూ వీడియో రివ్యూ 👇🏿


మూవీ మేటర్స్ వీడియో రివ్యూ 👇🏿


విస్తారమైన కథ, భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్… ఇవేవీ మనసు లోతుల్లోకి వెళ్ళి ప్రభావం చూపించలేకపోయాయి. ఎవరో మొదలు పెట్టిన వంటను… వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది. నిరంకుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వీరమల్లు చుక్కలు చూపిస్తాడనుకుంటే దాన్ని రెండో భాగానికి వాయిదా వేయడం కాస్తంత నిరాశను కల్గించే అంశం. అయితే నిర్మాతలు ఎ. ఎం. రత్నం (A.M. Ratnam), దయాకరరావు, దర్శకుడు జ్యోతికృష్ణ కృషిని తక్కువ చేయలేం. పవర్ స్టార్ అభిమానులను, జనసైనికులను, హిందుత్వ వాదులను ‘హరిహర వీరమల్లు’ సంతృప్తి పరుస్తాడని చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: పవర్ స్టార్ వన్ మ్యాన్ షో

సౌజన్యం :  ఆంధ్రజ్యోతి లింక్


  • పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కోసం చేయాల్సిందంతా చేశాడు. తనకే సొంతమైన ‘ఆరా’ సినిమాలో కొన్ని ఎపిసోడ్లను నిలబెట్టింది. ఆయనే సినిమాకు అతి పెద్ద ఆకర్షణ.
  • హీరోయిన్ నిధి అగర్వాల్ కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. ఆధునిక ఛాయలతో కనిపించే ఆమె ‘పంచమి’ పాత్రకు అంతగా కుదిరనట్లు అనిపించలేదు. పాత్రకు అవసరమైన పరిణతి ఆమెలో కనిపించలేదు.
  • ఔరంగజేబుగా బాబీ డియోల్ సరిపోయాడు. అతడి నటన కూడా బాగుంది. సత్యరాజ్.. సచిన్ ఖేద్కర్ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు.
  • సాంకేతిక విభాగాల్లో ‘హరిహర వీరమల్లు’కు అతి పెద్ద బలం కీరవాణి నేపథ్య సంగీతమే. ఆయన స్కోర్ విషయంలో శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు. కథలో కీలకమైన ఎపిసోడ్లను బీజీఎంతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. ఐతే పాటలు మాత్రం అంత గొప్పగా లేవు.  జ్ఞానశేఖర్.. మనోజ్ పరమహంస లాంటి పేరున్న సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందించారు. కానీ విజువల్స్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రభావం వాటి మీద పడ్డట్లు అనిపిస్తుంది. సినిమాకు వీఎఫెక్స్ అతి పెద్ద బలహీనత.
  • క్రిష్ రాసిన కథ బాగున్నా.. అదంత ప్రభావవంతంగా తెరకెక్కలేదు. ఆయన ఎంత వరకు డైరెక్ట్ చేశారు.. జ్యోతికృష్ణ టేకింగ్ ఎంత వరకు అన్న క్లారిటీ లేదు కానీ.. కథనంలో మాత్రం నిలకడ కనిపించదు.
  • చివరగా: హరిహర వీరమల్లు.. కొన్ని మెరుపులు ఎన్నో మరకలు
  • రేటింగ్ – 2 / 5 😔

సౌజన్యం :  తుపాకి.కామ్ లింక్


రా వన్ ఫర్ యు ఛానెల్ రివ్యూ 👇🏿


మూవీస్ ఫర్ యు ఛానెల్ వీడియో రివ్యూ 👇🏿


మాన్ ఆఫ్ ఫిక్షన్ ఛానెల్ రివ్యూ 👇🏿

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

స్ట్రేంజర్ థింగ్స్ 5 | అధికారిక టీజర్ | నెట్‌ఫ్లిక్స్

ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ | రివ్యూ | ట్రైలర్