ఎలా ఉందంటే..
అక్కడక్కడా కాసిన్ని నవ్వులు, పంచ్ డైలాగ్‌లు మినహా కథ, కథనాల్లో కొత్తదనం లేదు.
ద్వితీయార్ధమంతా నవ్వులు పంచేలా తీర్చిదిద్దారు. పతాక సన్నివేశాలు ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఎమోషనల్ టచ్‌తో ముగించారు.
ఎవరెలా చేశారంటే..
అజయ్ దేవగణ్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్’లో వినోదంతో పాటు, యాక్షన్‌తోనూ అదరగొట్టారు. ఆ పేరును కొనసాగిస్తూ వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్2’లో వినోదానికి మాత్రమే పెద్ద పీట వేశారు. రుబియాగా మృణాళ్ హాట్‌గా కనిపించింది. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. దర్శకుడు విజయ్ కుమార్ అరోరా పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు కానీ, దానిని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దడంలో మాత్రం తడబడ్డారు. పంచ్‌డైలాగ్‌లు, వన్‌లైనర్‌లతో నవ్వులు పుట్టించే ప్రయత్నం చేశారంతే.
- బలాలు
- + అజయ్, మృణాళ్‌ల నటన
- + కొన్ని కామెడీ మెరుపులు
- బలహీనతలు
- – ప్రథమార్ధం
- – కొత్తదనం లేని కథ, కథనాలు
- చివరిగా: జస్ట్ టైమ్ పాస్ ‘సన్ ఆఫ్ సర్దార్2’
సౌజన్యం : ఈనాడు, పూర్తి రివ్యూ లింక్
GIPHY App Key not set. Please check settings