చిత్రం : తమ్ముడు
విడుదల: 04-07-2025
నటీనటులు: నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ ,
సౌరభ్ సచ్దేవ్,శ్వాసిక, హరితేజ తదితరులు
సంగీతం : బి.అజనీష్ లోకనాథ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సమీర్‌రెడ్డి, సేతు
నిర్మాత: రాజు-శిరీష్
రచన, దర్శ కత్వం : వేణు శ్రీరామ్
మొదటిగా ఈనాడు దినపత్రికలో వచ్చిన సమీక్షలో…
జై అనే ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపిస్తాడు నితిన్. ఆయన కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడని సినిమా ఇది. ప్రతినాయకుడిగా నటించిన సౌరభ్ సచ్‌దేవా మెప్పిస్తాడు. వర్ష బొల్లమ్మ , శ్వాసిక విజయన్ పోరాట ఘట్టాలతోనూ ఆకట్టుకుంటారు. సప్తమిగౌడ చిన్న పాత్రలోనే కనిపిస్తారు.
సాంకేతిక విభాగాల్లో సంగీతం,ఛాయాగ్రహగ్రణం పనితీరు మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు రచనలోనే బలం లేదు.
బలాలు
+ ప్రతినాయకుడి పాత్ర డిజైన్
+ సాం కేతిక బృందం పనితీరు
బలహీనతలు
– కొరవడిన భావోద్వేగాలు
– బలం లేని కథ, కథనాలు
చివరిగా: ప్చ్.. సారీ ‘తమ్ము డు’ 😔
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏమి రాసింది అంటే…
ఈ సినిమా ప్రారంభంలో ఓ సంస్కృత వాక్యం గురించి చెబుతారు. ‘అనుగచ్ఛతి ప్రవాహ’ అని. అంటే ‘ప్రవాహంతో పాటు వెళ్ళు’ అని అర్థం. ఈ సినిమాలో హీరో నైజం అదే… కానీ దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం యేటికి ఎదురీదాలని ప్రయత్నించి భంగపడ్డాడు.
రేటింగ్: 2.25/5 😔
ట్యాగ్ లైన్: సారీ… తమ్ముడు!
గ్రేట్ ఆంధ్రా వెబ్సైట్ వారి రివ్యూ…
చివరిగా చెప్పేదేంటంటే.. ఎంత నీరసం తెప్పిస్తున్నా “అనుగచ్చతి ప్రవాహ” అనుకుంటూ నిట్టూ రుస్తున్న ప్రేక్షకులకి ఒక దశలో తెర మీద మృత్యుంజయ మంత్రం వినిపిస్తుంది. అది ప్రేక్షకులు తమ కోసమే అని దర్శ కుడి దయార్ద్ర హృ దయానికి దండం పెట్టాల్సిన పరిస్థితి. ఒక సీన్లో ఫ్రస్ట్రేషన్ తో ఒక అంబరగొడుగు వాసి తల పైకెత్తి విచిత్రంగా అరుస్తాడు. సినిమా క్లైమాక్స్ చూసాక హాల్లో ఒక ప్రేక్షకుడు సరిగ్గా అలాగే అరిచాడు.
ఇంతకంటే సున్నితంగా ఈ చిత్రాన్ని సమీక్షించడం కష్టం. టైటిల్ ని చూసో, లయకి కంబ్యాక్ అనో వెళితే ప్రతి సినిమాని పెద్ద మనసుతో ఆదరించగలిగే ప్రేక్షకులకి కూడా చుక్కెదురవుతుంది.
రేటింగ్: 1.75/5
బాటం లైన్: కష్టం తమ్ముడూ! 🙂↔️
తుపాకి.కామ్ వెబ్సైట్ వారి రివ్యూ…
సాంకేతికంగా ‘తమ్ముడు’లో మంచి ప్రమాణాలే కనిపిస్తాయి. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో తన మార్కు చూపించాడు. బీజీఎం మంచి ఊపుతో సాగింది. పాటలు కూడా పర్వాలేదు. ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేసిన సినిమా విజువల్ గానూ బావుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. బాగా ఖర్చు పెట్టి తీసిన విషయం తెరపై కనిపిస్తుంది. ఐతే అన్ని వనరులు బాగానే సమకూరినా రచయిత-దర్శకుడు వేణు శ్రీరామ్ ఉపయోగించుకోలేక పోయాడు. అతడి కథ బాగానే అనిపించినా.. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే లేక ప్రేక్షకులను అతను ఎంగేజ్ చెయ్యలేకపోయాడు. ప్రధాన పాత్రల మధ్య.. ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచడంలో వేణు ఫెయిలయ్యాడు.
చివరగా: తమ్ముడు.. దారి తప్పాడు
రేటింగ్: 2/5 😣
ది హిందూ.కామ్ ఆంగ్ల దినపత్రిక రివ్యూ ఇంగ్లీష్‌లో…
At one point, a character opens a container and announces, “There’s nothing inside.” Someone in the audience said, “Ee cinema-lo emi ledu (there’s nothing in this film either).” That, unfortunately, sums it up. 😯
సినీజోష్.కామ్ వెబ్సైట్ వారి రివ్యూ ఇంగ్లీష్‌లో…
Thammudu (2025) Movie: Rating Analysis
Altogether, Thammudu turns out to be an outdated entertainer. Director Venu Sriram starts the narration in an interesting manner but from then on monotony creeps on and even Nithiin with all his sincerity fails to change the outcome. Lack of spine in the story, screenplay and direction played spoilsport with the outcome. Considering all these elements, Cinejosh goes with a 1.75 rating for Thammudu. 😔
గుల్తే.కామ్ వెబ్సైట్ రివ్యూ ఇంగ్లీష్‌లో…
Overall, Thammudu will be a bitter experience for everyone involved, and as far as Nithiin is concerned, his lookout for a proper commercial hit continues.
Bottomline: Vaddu Thammudu! 🙂↔️
Rating: 2/5
తెలుగువన్.కామ్ వెబ్సైట్ రివ్యూ ఇంగ్లీష్‌లో…
Lack of connectivity and stretching each scene to the brim works against the movie. Overall, the unimaginative narrative and drag in the screenplay makes this Thammudu, a very tough watch.
Bottomline:
Thammudu fails to impress and tests patience.
Rating: 2/5 😯
కొన్ని విడియో రివ్యూలు…
GIPHY App Key not set. Please check settings