మా తెలుగు టెక్ ఛానెల్‌కు (తెలుగు టెక్ విత్ శ్రీనివాస్) స్వాగతం, నేను ప్రాథమికంగా ఇంజనీర్ని & ఎలక్ట్రానిక్స్ మరియు ఫోటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి.
మేము కొన్ని తాజా గాడ్జెట్లను అన్బాక్సింగ్ చేస్తాము మరియు ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం సమీక్షలు చేస్తాము. కనీసం వారానికి ఒకసారి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము అంటున్నారు శ్రీనివాస్ గారు. ఈయనకి ఫొటోగ్రఫీ, కెమెరాలు,అడియో పరికరాల మీద అద్భుతమైన నాలెడ్జి, పట్టు ఉంది. ఈయన కొడుకు కూడా ప్రముఖ యూట్యూబర్(802K సబ్స్క్రైబర్లు ఉన్నారు). ఇంగ్లీష్‌లో చేస్తుంటారు. అంటే తండ్రిని మించిన తనయుడు అన్నమాట. ఇంకో విశేషం ఈయన కూతురు హిందీలో టెక్నాలజి మీద చేస్తుంటే ఈయన శ్రీమతి వంటల గురించిన చానల్ నడుపుతున్నారు. ఈయనకు 719K సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడ టెక్ చానల్ నడుపుతున్నారు.


GIPHY App Key not set. Please check settings